వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు కానుకగా ఇస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం దేవినేని అవినాష్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. జన ప్రభంజనంతో దేవినేని అవినాష్ భారీ నామినేషన్ ర్యాలీ నిర్వహించగా ఎంపీ అభ్యర్థి కేశినేని నాని పాల్గొని మద్దతు తెలిపారు. జన సందోహం, కోలాహలం మధ్య అట్టహాసంగా సాగిన నామినేషన్ కార్యక్రమంలో కేశినేని శ్రీనివాస్ (నాని) కుమార్తెలు కేశినేని హైమ , కేశినేని శ్వేత, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు, పార్టీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మీదుగా రామలింగేశ్వర నగర్, స్క్రూ బ్రిడ్జి, రాణి గారి తోట, సత్యం గారి హోటల్ మీదుగా డీసీఎం గ్రాండ్ వరకు భారీ ర్యాలీతో చేరుకున్నారు. అడుగడుగునా హారతులు, పూల మాలలతో ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్‌కు బ్రహ్మరధం పట్టారు. బంజారా నృత్యాలు, డప్పులు, డీజేలతో, జగనన్న పాటలతో యువకులతో ఉత్సాహంగా జరిగిన ర్యాలీకి నియోజకవర్గ నలుమూలల నుంచి వైయస్ఆర్‌షీపీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.
![]() |
![]() |