శ్రీకాకుళం జిల్లా, ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన, భారతీయజనతా పార్టీల నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలువురు కీలక నేతలు చేరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్. రాజాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన డి నాగేశ్వరరావు. చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన స్పోక్స్ పర్సన్ రేగిడి లక్ష్మణరావు. కోటబొమ్మాళి చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్ బస్సుయాత్ర అక్కచెల్లెమ్మలు ఆత్మీయ స్వాగతం పలికారు.
![]() |
![]() |