సోలార్ పాలసీని తీసుకొచ్చి సీఎం జగన్ బినామీ సంస్థలకు వేలాది ఎకరాల భూములను కట్టబెట్టారని ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ గురువారం ఆరోపించారు. శిరిడి సాయి, ఇండోసాల్ కంపెనీలకు ఎకరా రూ. 3 లక్షల చొప్పున శ్రీ సత్యసాయి జిల్లాలో లక్ష ఎకరాలు కట్టబెడుతున్నారని అన్నారు. ముదిగుబ్బ మండలంలో 6, 300 ఎకరాలు సేకరిస్తున్నారని, రైతుకు ఎకరాకు రూ. 30 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉండగా రూ. 15 వేలు ఇస్తున్నారని పేర్కొన్నారు.