పంగులూరు మండలం కొండ మంజులూరు పాలకేంద్రం వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముప్పవరం గ్రామానికి చెందిన కిషోర్, అద్దంకికి చెందిన చందు, ముండ్లమూరు గ్రామానికి చెందిన ప్రవీణ్ లు ద్విచక్ర వాహనం పై ముప్పవరం వైపు వెళుతుండగా వాహనం చెడిపోవడంతో దానిని టోల్ ప్లాజా వద్ద ఉంచారు. ఈ క్రమంలో నడిచి వెళుతుండగా వెనకనుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కిషోర్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.