ఈనెల 26వ తేదీన గుడ్లూరులో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని గురువారం టిడిపి నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సాయంత్రం కందుకూరు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గుడ్లూరులో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొంటారని తెలిపారు. కావున మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.