అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన పర్చూరులో ఎన్నికల కోడ్ అమలులో అధికార యంత్రాంగం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పర్చూరులో ప్రధానమైన బొమ్మల కూడలిలో అనేక మంది రాజకీయ నేతల విగ్రహాలు ఉంటాయి. అయితే ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా ఆ విగ్రహాల కు ముసుగులు వేసిన అధికారులు దానిపైనే ఉన్న రాజీవ్ సెంటర్ అన్న పేరును కప్పి వేయలేదు. ఇది కాంగ్రెస్ కి అనుకూలించే అంశం అని ఇతర రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి.