ఓబులవారి పల్లి మండలం ముక్కావారి పల్లికి చెందిన ఎర్రబాబు శంకర్ రెడ్డి 5 ఎకరాలు అరటి తోట గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో బుధవారం దగ్ధమైంది. ఈ విషయం రైల్వే కోడూరు అగ్నిమాపక కేంద్రానికి తెలియజేయగా వెంటనే వారు స్పందించి ముక్కావారి పల్లి ఆంజనేయ స్వామి దేవస్థానం పక్కన దగ్ధమౌతున్న ఐదు ఎకరాలు అరటి తోటలో మంటలు ఆర్పి అదుపు చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.