ఎన్నికల కమీషన్ అంటే లెక్కలేకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను యధేచ్చగా ఉల్లంఘిస్తున్న చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విన్నవించామని అప్పిరెడ్డి తెలియచేశారు.ఇప్పటికి ముఖ్యమంత్రి జగన్ గారిపై వ్యక్తిగతంగా కామెంట్స్ చేస్తూ సంస్కారం లేకుండా ప్రవర్తించడమే కాకుండా ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తి 40 ఇయర్స్ ఇండస్ర్టీ అని చెప్పుకునే చంద్రబాబు ఇలా మాట్లాడటం సరికాదన్నారు.