ఓడిపోతున్నాం అని తెలిసి చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసమే పవన్ కల్యాణ్ తాపత్రయం అని వైయస్సార్ సిపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.తాడేపల్లిలో తనను కలిసిన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. చిరంజీవిని ఉద్దేశించి నేను ఏమి అనలేదు. మీడియావాళ్ళు చిరంజీవి కూటమికి మధ్దతు ఇచ్చారు.... దీనిపై నా అభిప్రాయం అడిగితే దానిపై స్పందిస్తూ చిరంజీవి కూటమికి మద్దతు ఇవ్వడం మంచిదే కానీ.. కూటమితో చిరంజీవే కాదు ఇంకా ఎవ్వరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదని చెప్పా. చిరంజీవిని నేను విమర్శించాను అని చెప్పడం ద్వారా కొంత మందినైనా దగ్గర చేసుకోవచ్చని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు. నేను చిరంజీవిని కామెంట్ చేశానని ఇంతగా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ఆలోచిస్తే.... చంద్రబాబు,పవన్ కల్యాణ్ ల శక్తి సరిపోదని భావించి చిరంజీవి అభిమానులు,ఆ సామాజిక వర్గం వారి ఓట్లను గంపగుత్తగా తీసుకువెళ్లి చంద్రబాబుకు ఎలా వేయించాలా అనే తపన,ఆత్రం అందులో కనిపిస్తున్నాయి. 2014లో బీజేపీ, జనసేన, టీడీపీకి మధ్దతు ఇచ్చాయి.అప్పుడు ప్రజలను రాచి రంపాన పెట్టారు. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారు” అని మండిపడ్డారు. బాండెడ్ లేబర్ కంటే అన్యాయంగా బీజేపీ, జనసేన టీడీపీ ముేందు సాగిలపడ్డాయి. ఆత్మాభిమానం వదిలేసి రెండు పార్టీలు టీడీపీతో జత కట్టాయి. వాళ్ళు ఓడిపోతున్నాం అని తెలిసి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. డ్వాక్రా మహిళల గురించి చంద్ర బాబు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వొస్తుంది.హాస్యస్పదంగా కనిపిస్తోంది. డ్వాక్రా మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. 2014లో డ్వాక్రా మహిళలకు రుణ మాఫీలు చేస్తానని చంద్రబాబు మోసం చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు సంస్కారం లేదు. చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలుసా? చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఎక్కడ ఉన్నాడు.?. చంద్రబాబు చెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారు?” ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పగలరా అని సజ్జల ప్రశ్నించారు.