ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి షాకిస్తూ కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం పులివెందులలో నామినేషన్ వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి (టీడీపీ) సోదరుడు శ్రీనాథ్ రెడ్డి, దంపతులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరు. గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పుంగనూరులో టీడీపీ తరపున శ్రీనాథ్ రెడ్డి భార్య అనీషా రెడ్డి పోటి చేసిన విషయం విధితమే.