ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. కాసేపటి కిందటే ఆయన వైయస్ఆర్ జిల్లా పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే అందుకు ముందు బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. నామినేషన్ గ్యాప్‌లో తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. సిద్ధం పేరుతో ఒకవైపు వైయస్ఆర్‌సీపీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తూనే.. మరోవైపు ఏపీ ఓటర్లకు ఆయన సంక్షేమ పాలన చూసి ఓటేయాలని కోరుతున్న సంగతి చూస్తున్నాం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సిద్ధం.. ఓట్ ఫర్ ఫ్యాన్ అంటూ తాజాగా ట్వీట్ చేశారు. అంతకు ముందు వైయస్ఆర్‌సీపీ సిద్ధం సభల్లో తన ప్రసంగాలతో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్రంలో ఎన్నికల మూడ్ తీసుకొచ్చిన సీఎం వైయస్ జగన్.. ఆ తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్రల సమయంలోనూ ఆయా జిల్లాలను ఉద్దేశిస్తూ సిద్ధం అని ట్వీట్లు చేసింది చూశాం. ఇప్పుడు ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుస్తూ.. పార్టీలో జోష్ నింపుతూ ఆంధ్రప్రదేశ్ సిద్ధం అంటూ ట్వీట్ చేశారు.