ఎన్డీయే ప్రభుత్వం వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని జగన్ విష ప్రచారం చేస్తున్నారు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అయన మాట్లాడుతూ.... దీనిని నమ్మకండి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కోటా తొలగించం. రాష్ట్ర అభివృద్ధి కోసమే జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నాం. 3 పార్టీలు రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగం చేశాయి. ఓడిపోతామనే భయంతో ముస్లింలలో విషబీజం నాటేందుకు జగన్ కుట్రలు చేస్తున్నాడు. ఆయన గారడీ మాటలు చెల్లవు. ఉద్యోగులకు జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశాడు. మేం అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాం అని హామీ ఇచ్చారు.