మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతోందని, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావని, రాబోయే ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో మీ బిడ్డ జగన్‌కు ఓటు వేస్తే సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని, ఇంటింటికీ అభివృద్ధి జరుగుతుందని, పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లే.. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది.. లేచి లకలకలక అంటూ మీ దగ్గరికి వస్తుందని అందరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. చంద్రబాబు చేసేవన్నీ మాయలు.. కుట్రలు అని, ఈ 59 నెలల పాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చాడని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.