ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణంపై విచారణలో భాగంగా రూ.205 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ శుక్రవారం వెల్లడించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ తుతేజా రూ.15.82 కోట్లు, అన్వర్ దేబార్ రూ.116.16 కోట్లు, వికాశ్ అగర్వాల్ రూ.1.54 కోట్లు, అరవింద్ సింగ్ రూ.12.99 కోట్ల విలువైన 33 ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది.