ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 9న ప్రత్యేక రైలు(07510) తిరుపతిలో రాత్రి 8.05 గంటలకు బయల్దేరుతుంది.. రేణిగుంటకు 8.20 గంటలకు వస్తుంది. గూడూరుకు రాత్రి 10.10 గంటలకు.. నెల్లూరుకు రాత్రి 22.42 గంటలకు చేరుకుంటుంది. ఒంగోలుకు అర్థరాత్రి 12.10 గంటలకు.. చీరాలకు 12.45 గంటలకు వస్తుంది. బాపట్లకు 1.03 గంటలకు.. తెనాలి 01.58, గుంటూరు 02.20, సత్తెనపల్లి 3 గంటలకు, నడికుడి 04.00, మిర్యాలగూడ 4.40 గంటలకు, నల్గొండ 5.15 గంటలకు, సికింద్రాబాద్ ఉదయం 09.10 గంటలకు చేరుతుంది.
మరో రైలు సికింద్రాబాద్ నుంచి మరో రైలు (07489) 11వ తేదీన తిరుపతికి వెళుతుంది. ఈ రైలు మే 11 రాత్రి 10.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, రాయిచూర్ జంక్షన్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట జంక్షన్ స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలును అందుబాటులో ఉంచారు. ఈ రైలు నెంబర్ 07490. ఈ నెల 13వ తేదీన రాత్రి 7.50 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట జంక్షన్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి జంక్షన్, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ, మౌలాలి స్టేషన్లలో ఆగుతుంది.
ఈనెల 10వ తేదీన సికింద్రాబాద్‌లో 20.45 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు (07027) సత్తెనపల్లికి రాత్రి 23.38, గుంటూరు 00.40, విజయవాడ 02.00, బ్రహ్మపూర్ 14.45 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు(07028) తిరుగు ప్రయాణంలో 11న బ్రహ్మపూర్‌లో 16.45 గంటలకు ప్రారంభమై విజయవాడ 03.20, గుంటూరు 04.30, సత్తెనపల్లి 05.23, సికింద్రాబాద్ 10.05 గంటలకు వెళుతుంది. ప్రత్యేక రైలు(07509) ఈనెల 12న సికింద్రాబాద్‌లో 20.00 గంటలకు బయలుదేరుతుంది. నడికుడి 22.40, సత్తెనపల్లి 23.20, గుంటూరు 23.50, తెనాలి 00.40, తిరుపతి 08.20 గంటలకు వెళ్తుంది.
ప్రత్యేక రైలు(08420) భువనేశ్వర్ నుంచి లోకమాన్యతిలక్ టర్మినల్‌కు.. మే, జూన్ నెలల్లో ప్రతి బుధవారం భువనేశ్వర్‌లో 23.00 గంటలకు ప్రారంభమై విజయవాడ 12.22, గుంటూరు 13.55, సత్తెనపల్లి 14.40, పిడుగురాళ్ల 15.19, నడికుడి 15.38, సికింద్రాబాద్ 19.20, లోకమాన్యతిలక్ టర్మినల్‌కు శుక్రవారం 10.30 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08419) మే, జూన్ నెలల్లో ప్రతి శుక్రవారం లోకమాన్యతిలక్ టర్మినల్‌లో 13.20 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్ 03.30, నడికుడి 06.30, గుంటూరు 09.43, విజయవాడ 10.40, భువనేశ్వర్ ఆదివారం 01.45 గంటలకు వెళ్తుంది.