రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైయస్ షర్మిల మంగళవారం కమలాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు పార్టీ జనరల్ సెక్రెటరీ రాజా మంగళవారం ఒక ప్రకటన పేర్కొన్నారు. యోగి వేమన యూనివర్సిటీ, పైడికాలువ, తుమ్మలూరు, రాజుపాలెం, ఊరుటూరు, పెద్దచేపలి, కమలాపురం, చెన్నూరులలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రచారని విజయవంతం చేయాలని కోరారు.