ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంకు ఎదురుగా ఉన్న సంజీవరాయనికి టీటీడీ అధికారులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి వారు పట్టు వస్త్రాలు, గజ మాలలు సమర్పించారు. ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని సుందరంగా అలంకరించారు. దర్శనార్థం భక్తులను అనుమతింపజేశారు. తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు.