ఒంగోలు బీఎస్పీ ఎంపీ అభ్యర్థి ధరణికోట లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కనిగిరికి వచ్చారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎస్పీ కృషి చేస్తుందన్నారు. 80% ఉన్న బహుజనుల అభ్యున్నతి సాధించాలంటే రాజ్యాధికారంలోకి వచ్చేందుకు బీఎస్పీ అభ్యర్థులకు ఓట్లు వేయాలన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి తాతపూడి ప్రభుదాస్, జిల్లా ఇన్ ఛార్జ్ ఎం మరియదాసు పాల్గొన్నారు.