పొన్నలూరు మండంలోని ఉప్పలదిన్నె, వెంకుపాలెం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఏపీఓ మాచర్ల సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీల పనితనం, మస్టర్ రోల్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలు ఒకరి పేరు మీద మరొకరు చేయకూడదన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ఉపాధి పనులకు పంపించకూడదని చెప్పారు. మస్టర్ రోల్ లో అవకతవకలు జరిగితే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.