ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం టంగుటూరు మండలం లోని తెటుపురం గ్రామంలో రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి, కొండేపి నియోజకవర్గ అసెంబ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తేటుపురం గ్రామస్తులు, ముఖ్యంగా యువత పూలమాలలు, మంగళ హారతులు పట్టారు. అనంతరం బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు.