మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ ఆ ఘటన జరిగినట్లుగా చెబుతున్న మే 2వ తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సాధారణ పౌరులకు చూపించారు. దీనిపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఆ వీడియోలు ఎడిటెడ్ అని ఆరోపించారు. ‘‘నేను మొత్తం ఫుటేజీ చూశాను. అందులో దిగ్భ్రాంతి కలిగించే దృశ్యాలున్నాయి. దీంతో పాటు మరికొన్ని వీడియోల పెన్‌డ్రైవ్ నా దగ్గర ఉంది’ అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa