మైనార్టీ రిజర్వేషన్ల రద్దుకే చంద్రబాబు, పవన్ మద్దతిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మహ్మద్ అబ్దుల్ హఫీజ్‌ఖాన్ పేర్కొన్నారు. మతాలకు సంబంధం లేకుండా అన్ని కులాల్లోనూ వెనుకబడిన వర్గాలుంటారు. కనుక, ముస్లీం మైనార్టీల్లోనూ అభివృద్ధి లేక, అణగారిని కుటుంబాలున్నాయని.. వారికి కల్పించే 4 శాతం రిజర్వేషన్‌ను మతం ఆధారంగా చూడకూడదన్నారు. అవకాశాలకు నోచుకోకుండా.. అన్ని రంగాల్లోనూ అట్టడుగుస్థాయిలో ఉన్న ముస్లీంలను పైకి తేవాలనే లక్ష్యంతోనే లాజికల్‌గా, లీగల్‌గా, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్‌ను కొనసాగిస్తామని జగన్ గారు వివరించారు. ఈ విషయంలో ఎన్‌డీఏ కూటమి తరఫున ఎవరు ఏం మాట్లాడినా.. నేను మీ పక్కన అండగా నిలబడి మాట్లాడుతానన్న దమ్మున్న నాయకుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు. అప్పుడు ఆయన మాటలు ప్రతీ ముస్లీం సోదరుడి గుండెల్లో నిలిచిపోయాయని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa