ఆత్మకూరు మండలం వడ్డుపల్లికి చెందిన ఆదినారాయణరెడ్డి (50) వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడు మరమ్మతు పనుల్లోనూ పాలుపంచుకునేవాడు. ఆదివారం ఉదయం ఆత్మకూరు వద్ద విద్యుత్ స్తంభంపై ఎక్కి సర్వీస్ లైన్ లాగుతుండగా విద్యుత్ షాక్ కు గురై కిందపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు.
![]() |
![]() |