రాజస్థాన్ జైపూర్ నగరంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. నగరంలోని కనీసం 4 స్కూళ్లకు ఇ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. పాఠశాలలో విద్యార్థులను, సిబ్బందిని పోలీసులు ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో పోలీసులు విస్తృతంగా సోదాలు చేపడుతున్నారు. ఆదివారమే జైపూర్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఒక రోజు తర్వాత నగరంలోని స్కూళ్లకు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.