ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎస్బీఐ శుభవార్త చెప్పింది. త్వరలో చేపట్టనున్న 12 వేల నియామకాల్లో 85 శాతం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకే అవకాశం కల్పిస్తామని బ్యాంక్ ఛైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో శిక్షణనిచ్చి నియమించుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ నియామకాలను సంస్థ చేపట్టనుంది. క్యాంపస్ నియామకాలు తగ్గిన సమయంలో ఎస్బీఐ ప్రకటన ఇంజినీరింగ్ విద్యార్థులకు ఊరటనివ్వనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa