పీలేరు నియోజకవర్గం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన పీలేరులో జరిగిందని బుధవారంం పోలీసులు తెలిపారు. పీలేరు-చిత్తూరు రోడ్డులోని ఇందిరమ్మకాలనీ వాసి సాయి మంగళవారం రాత్రి ద్విచక్రవాహనంలో పీలేరుకు వచ్చి ఇంటికి తిరిగి వెళ్తూ చిత్తూరు రోడ్డులోని రిలయన్స్ పెట్రోలు బంకు వద్ద కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. గాయపడ్డ అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.