భీమిలిలో వైసీపీ విజయం ఖాయమని ఆపార్టీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన భీమిలి పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంలో గతంలో కంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదైందని, పేదలు, మహిళలు, మధ్యతరగతి ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారన్నారు. వీరంతా వైసీపీ మద్దతుదారులేనని పేర్కొన్నారు.