దేశంలో రోజురోజుకు వాహనాల కాలుష్యం పెరిగిపోతోంది.ఈ నేపథ్యంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు పుణేకు చెందిన అధికారులు సరికొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కీ వాహనాలకు రూ.10 వేలు జరిమానా విధించేలా పెట్రోల్ పంపుల వద్ద అధునాతన కెమెరాలను ఉపయోగించి ఆటోమేటెడ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. త్వరలోనే ఈ సిస్టమ్ అందుబాటులోకి రావొచ్చు.