పల్నాడులో టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులకు తెగబడ్డారని, వారిని అడ్డుకోవడంలో పల్నాడులో పోలీస్ యంత్రాంగం విఫలమైందని మంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కన్నా లక్ష్మినారాయణ కుమారుడు ఓటర్లను బెదిరిస్తే పోలీసులు పట్టించుకోలేదన్నారు. నిబద్ధతతో పనిచేసే పోలీస్ అధికారులను మార్చేశారని, టీడీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారా..? అని ప్రశ్నించారు. చీమలమ్రరి, నాగనుపాడు సహా కొన్ని చోట్ల పోలింగ్ సరిగ్గా జరగలేదని, దమ్మాలపాడు, నార్నేపాడులోని కొన్ని చోట్ల రిగ్గింగ్ చేశారని, రిగ్గింగ్ జరిగిన చోట రీపోలింగ్ చేయాలని డిమాండ్ చేశారు.