తాడిపత్రిలో మంగళవారం సాయంత్రం ఉద్రిక్తతకు కారణమైన అల్లరి మూకల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. శాంతిభద్రతల విఘాతానికి కారకులైన ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటనలో పాల్గొన్న నియోజకవర్గంలోని రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తులు, రాజకీయంగా చురుగ్గా ఉన్న వ్యక్తులు ఏ పార్టీ వారైనా వదలకుండా జల్లెడ పడుతున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa