ఓబులవారిపల్లి మండలం జిల్లేల మడక చెరువు నుండి ఎటువంటి అనుమతులు లేకుండా గురువారం అక్రమంగా ఇటుక బట్టీ వారికి మట్టిని తరలిస్తుండగా పట్టుకొని రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఓబులవారిపల్లి మండల రెవెన్యూ అధికారి రామమోహన్ నాయుడు తెలిపారు. నీటి పారుదల శాఖ వద్ద అనుమతులు తీసుకొని ఇటుకల బట్టి యజమానులకు అక్రమంగా మట్టి తరలిస్తుండగా రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.