ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బ్రాహ్మణపల్లి గ్రామ సమీపంలోని కడప అమరావతి రాష్ట్రీయ రహదారిపై గురువారం టమాట లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడ్డ సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. నిద్ర మత్తు వల్లే ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుందని లారీ డ్రైవర్ వెల్లడించాడు. మదనపల్లి నుండి గుంటూరుకు టమాట లోడుతో వెళ్తుండగా బ్రాహ్మణపల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైందని డ్రైవర్ వెల్లడించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa