జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా చీరాల పట్టణంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్ధేశించి పిపిపి యూనిట్ వైద్యాధికారి డాక్టర్ యాకోబు మాట్లాడుతూ ఈ వ్యాధికి కారకమైన దోమలను నివారించేందుకు ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డెంగ్యూ వ్యాధి లక్షణాలను ప్రజలకు వివరించారు. ఈకార్యక్రమంలో డాక్టర్లు ప్రణయ్ నందా, ప్రణయ్ కుమార్, మలేరియా అధికారి శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa