విశాఖలో కుటుంబంపై దాడికి, రాజకీయాలకు సంబంధం లేదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. నిన్న విశాఖ పార్లమెంటు పరిధిలోని కంచరపాలెంలో జరిగిన దాడి ఘటనను, రాజకీయ కోణంలోకి తీసుకువచ్చి లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆ సంఘటనకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే శాంతియుతంగా, సోదర భావంతో ఉండే ప్రాంతమని, అలాంటి ప్రాంతంలో రాజకీయ లబ్ధి కోసం, లేనిపోని ఆరోపణలు చేస్తూ, అల్లర్లకు ప్రేరేపించవద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా ఏ సంఘటన జరిగినా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే సందర్భంలో రాజకీయ నాయకులు కూడా అనవసరమైన నిందారోపణలు చేయడం కూడా తగదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa