కందుకూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నట్లు కందుకూరు డీఎస్పీ శ్రీనివాస్ మంగళవారం పేర్కొన్నారు. ఈ నెల 31 వరకు యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. ఈ యాక్ట్ ద్వారా నిషేదాజ్ఞలు విధించినట్లు చెప్పారు. సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, బహిరంగసభలు నిర్వహించకూడదన్నారు. పైన పేర్కొన్న వాటికి ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు.