ఎన్నికల లెక్కింపు రోజు, తర్వాత కాకినాడసిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సందేశాల్లో ఏమాత్రం నిజంలేదని, తప్పుడు వదంతులు వ్యాప్తిచేస్తే కఠినచర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ హెచ్చరించారు. గత రెండురోజులుగా వివిధ సామాజిక మాధ్యమాలు, ప్రింట్, ఎలకా్ట్రనిక్ మీడియా విభాగాల్లో కౌంటింగ్ రోజున, కౌంటింగ్ తర్వాత కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గం పరిధిలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందంటూ నిఘా విభాగం నుంచి ఎన్నికల కమిషన్‌కు నివేదికలు వెళ్లాయని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదన్నారు. కాకినాడ జిల్లాలో గత నాలుగు నెలలుగా కేంద్ర పారా మిలటరీ బలగాల సమన్వయంతో పోలీసులు పూర్తిస్థాయిలో గస్తీ నిర్వహించారని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారంతో సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసులు కృషి చేశారన్నారు. నేర ప్రవృత్తి గలవారిని, సమస్యలు సృష్టించే వారిని మండ ల రెవెన్యూ అధికారి, మేజిస్ట్రేట్ ఎదుట బైండోవర్ చేశామన్నారు. ఎన్నికల సంఘం, ఏపీ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఉన్న తాధికారుల సూచనల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయం తో శాంతి భద్రతలను పరిరక్షించే దిశగా చర్యలు తీసుకున్నామని చెప్పారు.