ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఓట్ల లెక్కింపు ముందు తర్వాత శాంతి భద్రతలు కాపాడటానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మం గళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు సమయంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకలో అనుమతులు పొంది ఉన్న పనుల అమలుకు సంబందించి పూడికతీత పనులు, వ్యవసాయ సంబంధిత పనులు, నీటి సరఫరా సంబంధిత పనులు, పంట పొలాల అభివృద్ది పనులు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కాన్ఫ రెన్స్ సమావేశానికి డీఆర్వో మధుసూ దన్‌రావు, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ ఉమాపతి, ఇరిగేషన్ ఎస్‌ఈ రెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.