ఆంధ్రప్రదేశ్‌లో పీఎసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు)లో పనిచేస్తున్న ఉద్యోగులకు హైకోర్టు శుభవార్త చెప్పింది. పీఏసీఎస్ ఉద్యోగులు 62 ఏళ్లు పూర్తయ్యేవరకు సర్వీసులో కొనసాగవచ్చని కోర్టు తెలిపింది. ఒకవేళ పీఏసీఎస్ ఉద్యోగుల్లో ఎవరైనా 60 ఏళ్ల తర్వాత పదవీ విమరణ చేసి.. 62 ఏళ్లు పూర్తికాకుంటే అలాంటివారిని పునర్‌నియమించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు వారికి వేతనానికి సంబంధించి బకాయిలను చెల్లించాలని తెలిపింది. అయితే ఇక్కడ కీలక అంశాలను కోర్టు ప్రస్తావించింది.. తాము ఇస్తున్న ఉత్తర్వులు 60 ఏళ్లు పూర్తికావడానికి ముందు పిటిషన్లు దాఖలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.
ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ మయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని తమకు కూడా వర్తింపజేయాలని పీఏసీఎస్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచుతూ చేసిన చట్టం పిటిషనర్లకు వర్తిస్తుందని లాయర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు.. తీర్మానాలు చేశారన్నారు. పదవీ విరమణ వయసును పెంచే విషయంలో ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వ తరఫు లాయర్ వాదించారు. అయితే కో ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్ తీర్మానాలను ఆమోదించనంత వరకు ఎలాంటి విలువ ఉండదని కోర్టుకు వివరించారు. ఇప్పటికే ఈ విషయంలో ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి.. డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు పిటిషనర్లకు వర్తించదని తెలిపారు. పీఏసీసీఎస్ ఉద్యోగులు 62 ఏళ్ల వయసు నిండే వరకు సర్వీసులో కొనసాగించాలని ఆదేశించారు.కోర్టు ఆదేశాలపై ఉద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.