సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గురించి ఎన్నికలకు ముందే ఈసీ దృష్టికి తీసుకుని వెళ్ళమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అయన మాట్లాడుతూ.... ఆయా ప్రాంతాలలో ఓటర్లు సురక్షితంగా ఓటు వేసేలా భద్రత కల్పించాలని కోరామని తెలియచేశారు. అయినా పోలీసులు, ఎన్నికల అధికారులు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లనే తెలుగుదేశం పార్టీ దౌర్జన్యం, దాడులు, హింసకు పాల్పడిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అధికారులను మార్చమని ఒత్తిడి తెచ్చారని, ఈసీ కనీస విచారణ చేయకుండా అధికారులను నియమించిన నేపథ్యంలోనే హింస జరిగిందని వివరించారు.