రేవ్ పార్టీ అంశంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. తన పాస్‌పోర్టు తన దగ్గరే ఉందని, తన పాస్‌పోర్టు బెంగళూరులో దొరికినట్లు రుజువు చూపించాలని డిమాండ్ చేశారు. అక్కడ ఉన్న కారు తనదేనని సోమిరెడ్డి నిరూపించగలడా..? అని ప్రశ్నించారు. నెల్లూరులో మీడియా సమక్షంలో రక్తపరీక్షకు తాను సిద్ధమని, సోమిరెడ్డి సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ఎవరు తాగుతారో, డ్రగ్స్ తీసుకుంటారో బ్లడ్ శాంపిల్‌లో తేలిపోతుందన్నారు.