పోలింగ్ రోజు 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయని చెబుతున్న ఈసీ.. ఆ వీడియోలను ఎందుకు బయటపెట్టలేదు..? కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో మాత్రమే ఎందుకు రిలీజ్ అయ్యింది..? వీడియో ఈసీ రిలీజ్ చేసిందా.. వేరే వ్యక్తులు లీక్ చేశారా..? దానిపై ఈసీ ఎందుకు చర్యలు చేపట్టలేదు..? కేవలం వైయస్ఆర్ సీపీపై నింద వేయాలనే క్రమంలో టీడీపీని ఈసీ కాపాడుతున్న మాట వాస్తవం కాదా..? అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి డాక్టర్ అనిల్ కుమార్‌యాదవ్ ప్రశ్నించారు. తుమ్మురుకోట, చింతపల్లి, పాల్వాయ్‌గేట్‌లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతుందని, ఆ ప్రాంతంలో ఓటర్లను టీడీపీ గూండాలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి పోలీసులకు చెబుతున్నా పట్టించుకోలేదు, ఎస్పీకి ఫోన్ చేసినా కనీసం స్పందించలేదన్నారు.