శ్రీశైలం దేవస్థానంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు సర్వదర్శనం క్యూలైన్ల విస్తర పనులు చేపట్టాలని ఆలయ కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత సర్వదర్శనం క్యూలైన్లకు ఇరువైపుల ఖాళీగా ఉన్న క్యాంటీన్, రథశాల పక్కన స్థలంలో నూతన క్యూలైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వారాంతరాల్లో క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని అ సమయంలో భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిం చారు. అదేవిధంగా క్యూలైన్లలో భక్తులకు మంచినీరు, అల్పాహారం మొదలైనవాటిని నిరంతరం అందజేసేలా చూడాలన్నారు.