రవాణాశాఖకు సంబంధించిన అన్ని రకాల పౌరసేవలు 2018 నుంచి ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఎటువంటి సేవలు పొందాల్సి ఉన్నా, కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా ఎల్‌ఎల్‌ఆర్, డీఎల్‌ఎఫ్‌సీ వంటి సేవలకు మాత్రమే కార్యాలయానికి రావాల్సి వచ్చేది. ఆన్‌లైన్‌లోనే అనుమతులిచ్చేవారు. ఈ పౌర సౌవలను సిటిజన్ వెబ్‌సైట్ ద్వారా నిర్వహించేవారు. అయితే ఈ వెబ్‌సైట్‌ను బుధవారం సాయంత్రం నుంచి నిలిపివేసింది. దీంతో రవాణాశాఖ సేవలన్నీ నిలిచిపోవడంతో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. గురువారం సర్వర్ మొరాయించడంతో ఈ సమస్య మరింత ఎక్కువైంది. రవాణాశాఖ కార్యాలయానికి వచ్చిన వారంతా గంటలు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం గత రెండేళ్లుగా ఈ వెబ్‌సైట్‌ను నిలిపివేయాలని ప్రణాళిక చేసినప్పటికీ అలా జరగలేదు. దీంతో ఉన్నట్టుండి వెబ్‌సైట్‌ను నిలిపివేయడంతో వాహనదారులు ఆన్ లైన్ సేవలు నిలిచిపోయాయి. ఆ స్థానంలో ఆలిండియా సర్వర్ (వాహన వెబ్‌సైట్) ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ వెబ్‌సైట్ సిబ్బందికి అలవాటులేని కారణంగా అలవాటు అయ్యేంతవరకు సిబ్బందికి ఇబ్బందులు తప్పేలా లేవు.