ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర చీఫ్‌ సెక్రటరిని సస్పెండ్ చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 24, 2024, 06:29 PM

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలు లో ఉన్నా కూడా వైసీపీ ప్రభు త్వానికి వంతపాడుతూ పాలన సాగిస్తున్న రాష్ట్ర చీఫ్‌ సెక్రటరి జవహర్‌రెడ్డిని కేంద్ర ఎన్నికల కమిషన సస్పెం డ్‌ చేయాలని రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలపై వైసీపీ నాయకు ల దాడిని అరికట్టలేకపోయిన సీఎస్‌ పూర్తిగా విఫలమయ్యారన్నా రు. పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో మాచర్ల ఎమ్మె ల్యే పిన్నెల్లి రామ కృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎం లు పగులకొట్టడం దారుణమ న్నారు. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి పెద్దఎత్తున తన పీఎల్‌ఆర్‌ సంస్థకు చెందిన వాహనాలను, ఎక్సవేటర్లను చెన్నై పోర్టు ద్వారా జాంబి యాకు తరలించడం చూస్తే వైసీపీ ఓటమి ఖాయమని నిర్దారించుకోవ చ్చన్నారు. జూన 4 తరువాత ప్రజాప్ర భుత్వం వస్తుందని, వైసీపీ అరాచకాలకు అడ్డుకట్టప డుతుందని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com