వర్తమాన సమాజంలో అనేక సమస్యల పరిష్కారానికి బౌద్ధం దారిచూపుతుందని సెంటర్‌ఫర్ సోషల్ సైకాలజీ ప్రెసి డెంట్ ఆచార్య నూతలపాటి అరవింద్ అన్నారు. గౌతమబుద్ధుని జయంతిని పురస్కరించుకుని మానవతా వేదిక ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం మంగళగిరి వైష్ణవి కల్యాణ మండపంలో బుద్ధ పూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అరవింద్ మాట్లాడుతూ..... బౌద్ధం ఆచరిస్తున్న దేశంలోని ప్రజల జీవనశైలి అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పారు. మనదేశంలో నడయాడిన బౌద్ధం ఎల్లలు దాటి విశ్వవాపితమైందని గోలి మధు అధ్యక్షోపన్యాసంలో పేర్కొన్నారు. సైకాలజి స్టు ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ నైతికత పునాదుల మీద నడిచే దే బౌద్ధమన్నారు. నేటి సైకాలజిస్టులు సైతం బుద్ధుడి మార్గాన్ని తాకకుం డా ముందుకు వెళ్లలేరని చెప్పారు. మంగళగిరి సాహితీ కళావేదిక కన్వి నర్ గుత్తికొండ ధనుంజయరావు మాట్లాడుతూ మానవజాతి మనుగడ కోసం, సమాజంలోని రుగ్మతలను నిర్మూలించడం కోసం 2,500 సంవత్స రాల క్రితమే గౌతమ బుద్ధుడు బౌద్ధ ధర్మాన్ని రూపొందించారని తెలి పారు. అనంతరం అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం వ్యవ స్థాపక అధ్యక్షురాలు గూడూరు సీతామహాలక్ష్మీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షుడు రేఖా కృష్ణార్జున రావు, సాహిత్య, కళారంగ, ప్రజాసంఘాల ప్రముఖులు పామర్తి రవి, కం చర్ల కాశయ్య, కట్టా కళాధర్‌రెడ్డి, పొట్లాబత్తుని లక్ష్మణరావు, తాటిపాముల లక్ష్మీపెరుమాళ్లు, నన్నపనేని నాగేశ్వరరావు, దామర్ల కుబేరస్వామి, ఆకురాతి శంకరరావు, గోలి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.