శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డన్‌సెర్చ్ చేస్తున్నా మని సీఐ ప్రసాద్ తెలిపారు. గన్నవరం మండలంలోని కేసరపల్లి శివారు వీఎన్‌పురం కాలనీలో గురువారం తెల్లవారుజాము నుంచి కార్డెన్ సెర్చ్ నిర్వహిం చారు. ప్రతి ఇంటికీ వెళ్లి వివ రాలు సేకరించారు. వాహనాల రికార్డులు పరిశీలించారు. ఇంట్లో ఎంత మంది ఉంటున్నారు. ఎవరెవరు, ఎప్పటి నుంచి ఉంటున్నారు అని వివరాలు తెలుసుకున్నారు. అనుమానితుల సమాచారాన్ని పోలీసులకు ప్రజలు ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రికార్డులు సరిగా లేని 21 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. గన్నవరం ప్రాంతంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని తెలిపారు. 4, 5, 6 తేదీల్లో విజయోత్సవ ర్యాలీలు జరిపేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదన్నారు. మీటింగ్‌లు, ఇతరత్రా ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. గన్నవరం, ఉంగుటూరు పోలీస్‌స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.