ఎవరి కంటపడకుండా ప్రేమికులు చాటుగా రొమాన్స్ సాగిస్తుంటారు. కానీ, బరితెగించిన ఓ ప్రేమజంట నడిరోడ్డుపైనే బరితెగించింది. నలుగురు చూస్తారనే ఇంగితం కూడా లేకుండా బైక్‌పై వెళ్తూ ముద్దుల్లో మునిగి తేలిపోయింది. ద్విచక్రవాహనం మీదే రొమాన్స్ సాగించింది. ఈ దృశ్యం చూసి అటుగా వెళ్లే వాళ్లు అవాక్కయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోకి కోటా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ప్రియుడు వేగంగా బైక్ నడుపుతుంటే.. ప్రియురాలు అతడి ముందు ట్యాంక్‌పై కూర్చుని ముద్దుల్లో ముంచెత్తుతోంది సిగ్గు ఎగ్గూ లేకుండా ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. ట్రాఫిక్ నిబంధనలు కూడా పాటించకుండా దూసుకెళ్లారు.
యువకుడు బండి నడుపుతుంటే యువతి అతడ్ని గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెట్టింది. ప్రియుడు ఆమెతో సరసాలు ఆడుతూనే బైక్‌ను నడిపాడు. వాహనాలు వస్తూ పోతూ ఉన్నా సరే వారు రొమాన్స్‌కు బ్రేక్ పడలేదు. చుట్టుపక్కలవాళ్లు తమనే గమనిస్తున్నారన్న సోయి కూడా లేకుండా ఈ జంట రొమాన్స్‌లో మునిగిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. తక్షణమే స్పందించిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రేమ జంటపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కోటాలోని బుండి రోడ్డు హెర్బల్ గార్డెన్ సమీపంలో వీడియోను షూట్ చేసినట్టు గుర్లించారు. అయితే, ఎప్పుడు జరిగింది అనేది మాత్రం తెలియదని, వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కోటా అడిషనల్ ఎస్పీ దిలీప్ సైనీ మాట్లాడుతూ.. పోలీసులకు దీనిపై సమాచారం వచ్చందని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. రన్నింగ్ బైక్‌పై ముద్దులు పెట్టుకుని, రొమాన్స్‌లో మునిగి తేలిన ఘటన కర్ణాటకలోనూ వెలుగులోకి వచ్చింది. అయితే,, విచిత్రంగా ఇద్దరు అబ్బాయిలు రన్నింగ్‌లో ఉన్న స్కూటీపై ముద్దులు పెట్టుకుంటున్న వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. యూపీలోని రాంపూర్ పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు విస్తుపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa