రేపల్లె మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 29 వ తేదీన జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శేషాద్రి తెలిపారు. ఆదివారం రేపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 29 తేదీ ఉదయం 11 గంటలకు మున్సిపల్ చైర్ పర్సన్ కట్ట మంగ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు, అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని మున్సిపల్ కమిషనర్ శేషాద్రి కోరారు.