దాడుల సంస్కృతి నాది కాదని, హుందా రాజకీయాలే నా నైజం అని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. శనివారం తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో ఆయన మాట్లాడుతూ. చంద్రగిరిలో ఐదేళ్లుగా లెక్కకి మించి నాపై టీడీపీ నేత పులివర్తి నానితో పాటు అతని భార్య నోరుజారినా ఏరోజూ నేను పల్లెత్తు మాట అనలేదన్నారు. పులివర్తి నానీని నా రాజకీయ ప్రత్యర్థిగానే చూశాను తప్ప. శత్రువుగా ఎప్పుడూ భావించలేదని తెలిపారు.