వికోట మండల పరిధిలోని బోడిగుల్లపల్లె గ్రామంలో సీఐ లింగప్ప నేతృత్వంలో శనివారం కార్డన్ సర్చ్ నిర్వహించారు. అనుమానితుల ఇళ్లలో సోదాలు చేశారు. రికార్డులు సక్రమంగా లేని 27 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 9 వాహనాలకు రికార్డులు పరిశీలించి యజమానులకు అందజేశారు. మిగిలిన 18 వాహనాలు సీజ్ చేశారు. గ్రామాల్లో కొత్త వ్యక్తుల సంచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.